జనసేనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీకి యువరత్న నందమూరి బాలకృష్ణ అండగా ఉండగా, తమ పార్టీకి పోసాని కృష్ణ మురళి, ఆలీ వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు మాత్రమే అండగా ఉన్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తమ పార్టీకి సరైన హీరో ఎవరు అండగా లేరని బాధపడుతున్న వారికి రాజమండ్రిలో ఒకే ఒక షో నడిచిన ఒరేయ్ నిన్నే అనే ఏకైక సినిమా లో నటించిన హీరో ఉన్నాడని, ఆ పూల పిచ్చోడికి తాము ఫ్లవర్ స్టార్ అని పేరు పెట్టుకున్నామని ఎద్దేవా చేశారు.
జగన్ అనుమతిస్తే పది సినిమాలలో నటించి, 10 సూపర్ హిట్ లు కొడుతాడట. పది కాదని, పదేపదే సినిమాలలో నటించి ఆస్కార్ అవార్డును అందుకోవాలని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. సినిమాలలో బూతు చిత్రాలను సెన్సార్ చేస్తారు. బూతు ముఖలను సినిమాలలో అనుమతించే అవకాశం లేనందు వల్ల, వెబ్ సిరీస్ లలో నటిస్తే పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చునంటూ అపహాస్యం చేశారు.