వింజమూరు మండలంలోని వివిధ గ్రామాల్లో. ఇది మంచి ప్రభుత్వం.. కార్యక్రమంలో పాల్గొన్నారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులతో ప్రజల్లో సంతోషం కనిపిస్తోంది.వచ్చే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి మరింత ఊపందుకుంటుంది. చంద్రబాబును ఎన్నుకోవడం మంచిదైందని ప్రజలు భావిస్తున్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒకటవ తేదీన పేదలకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు అని తెలిపారు.
అలాగే పింఛన్ మొత్తాన్ని కూడా వెయ్యి రూపాయలు పెంచి ఇస్తున్నారు. పేదలకు పింఛన్లను పంపిణీ చేసి ప్రభుత్వ ఉద్యోగులు ఇంటికి రాగానే వారి జీతం కూడా పడుతోంది. గతం పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఉద్యోగులకు చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా త్వరలోనే ఇవ్వనున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కూడా అమలు చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం కొత్త బస్సులను కూడా కొనుగోలు చేస్తోంది అని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.