కాపు ఉద్యమ నాయకుడు.. మాజీ మంత్రి, సీనియర్ నేత..ముద్రగడ పద్మనాభం..తాను చేస్తున్న ఉద్యమం నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. తనను వ్యక్తిగతగా దూషిస్తున్నారని, అందుకే తాను మాన సిక వేద న చెంది. తప్పుకొంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎవరినీ నేరుగా ఏమీ అనలేదు. అయితే, ముద్రగడ తాను రాసిన లేఖలో పేర్కొన్నట్టు ఈ ఉద్యమం కారణంగా.. ఆయన సాధిం చింది ఏమీ లేదనేది వాస్తవం. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల దిశగా ఆలోచన చేస్తున్నారని తెలు స్తోంది.
నిజానికి 2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకట నే ఇప్పటికీ అమలు కాలేదు. ఇక, గత ఏడాది ఎన్నికలకు ముందు ఇదే అంశంపై మాట్లాడిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్ తేల్చేశారు. ఇది సాధ్యమయ్యే పనికాదన్నారు. దీంతో గత ప్రభుత్వంలో ఉద్యమం చేసినా సాధించుకోలేని .. రిజర్వేషన్.. ఇప్పుడు నాలుగేళ్లపాటు అధికారంలో ఉండే.. జగన్ ప్రభుత్వంలో సాధ్యమ య్యే పరస్థితి లేదనేది సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే ముద్రగడ తాను కొన్నేళ్లు చేపట్టిన కాపు ఉద్యమాన్ని పక్కన పెడుతున్నారని అనేవారు ఉన్నారు.
అయితే, ఇదే విషయంపై నడుస్తున్న మరికొన్ని విశ్లేషణలు గమనిస్తే.. ముద్రగడ త్వరలోనే రాజకీయాల్లో కి రానున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవమే. ఈ విషయాన్ని ముద్రగడ అనుచరులు కూడా చెబుతున్నారు. ఎన్నికలకు ముందు నుంచి వైఎస్సార్ సీపీ ముద్రగడను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎందుకంటే.. కాపుల రిజర్వేషన్‌పై వైఎస్సార్ సీపీ ఎలాంటి నిర్ణయమూ వెలువరించని నేపథ్యంలో ఆయన పార్టీలోకి వస్తే.. బ్యాడ్ సంకేతాలు వెలువడతాయని ఆయన భావించారు.
అయితే, ఇప్పుడు మాత్రం ఆయనను సమర్ధించే వారు కాపు నేతల్లో ఎవరూ కనిపించండం లేదు. ముడ పడని సమస్యను పట్టుకుని ఎన్నాళ్లు వేలాడతాం అనేవారు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీల నాయకులు కాపు రిజర్వేషన్‌పై మౌనం పాటిస్తున్నారు. ఇక, దానిని పట్టుకుని తాను ఉండేకన్నా.. కూడా ఏదో ఒక రాజకీయ పార్టీలోకి చేరడమే బెటర్ అని ముద్రగడ భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ఆయన వస్తే..చేర్చుకుంటామని వైఎస్సార్ సీపీ కూడా రహస్య మంతనాల్లో స్పష్టం చేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.