BREAKING : నారా భువనేశ్వరి ఉత్తరాంధ్ర పర్యటనకు బయలు దేరనున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు ‘నిజం గెలవాలి’ యాత్ర చేపట్టనున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తో మనస్థాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తారు. 3న విజయనగరం, 4న పార్వతీపురం మన్యం, 5న విశాఖ జిల్లాలో ఆమె పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.