రుషికొండ ప్యాలెస్‌లో బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి: నారా లోకేశ్‌

-

రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో ఇంకా బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముగ్గురు టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేసినా సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. బక్రీద్‌ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం లోకేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్‌ పెడతామని అన్నారు. ప్రజా దర్బార్‌ను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’కు అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. జీతాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు, బదిలీల కోసం ఉపాధ్యాయులు, ఉపాధి కల్పించాలని నిరుద్యోగులు , విద్య, వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరినట్లు లోకేశ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news