కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కోదండరామ్ నిలదీయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇవాళ మీడియాను అడ్రస్ చేసిన హరీష్ రావు.. కాంగ్రెస్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. వచ్చే ఆరు నెల్లలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామని… కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సీ నిర్వహించాలని BRS డిమాండ్ చేస్తుందని తెలిపారు.
పబ్లిక్ కమిషన్ ఛైర్మన్ ను కలిస్తే మా చేతుల్లో లేదని నిరుద్యోగులకు చెబుతున్నారట అని… కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలు కోదండరామ్ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఆరు నెలలు అయిన కొత్తగా పెన్షన్ లు ఇవ్వడం లేదు… ఆరు గ్యారెంటీ ల అమలు కోసం తీసుకున్న అప్లికేషన్లలు ఏం అయ్యాయి ? అంటూ నిలదీశారు.
ఏపీ లో కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వం పెంచిన పెన్షన్ పై సిఎం సంతకం పెట్టారు… మరి ఆరు నెలలు అయిన కాంగ్రెస్ సర్కార్ పెంచిన పెన్షన్ లు ఎందుకు ఇవ్వడం లేదు ? అని ప్రశ్నించారు. దివ్యంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది…వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం….ఇంటికి రెండు పెన్షన్ లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది…ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.