జగన్ ను ఓడించే మగాడు పుట్టలేదు – మంత్రి రోజా

పులివెందులలో వైసీపీని ఓడిస్తామంటూ టిడిపి మైండ్ గేమ్ కి తరలేపిన నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా పర్యాటక శాఖ మంత్రి రోజా తనదైన పంచులతో ప్రత్యర్థులపై విరుచుకుపడింది. పులివెందులలో జగన్ కి ఎదురుగాలి ఇస్తుందన్న ప్రచారాన్ని ధీటుగా తిప్పికొట్టింది మంత్రి రోజా. అసెంబ్లీలో మాట్లాడుతూ.. చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు లకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు మంత్రి రోజా. లోకేష్ గల్లీ గల్లీ తిరిగిన వెళ్ళగొట్టారని ఎద్దేవా చేశారు.

ప్రజలు 175 నియోజకవర్గాలలో జరిగిన అన్ని ఎన్నికలలో టిడిపిని ఓడించారని.. సింబల్ పై ఏడేళ్ల నుంచి టిడిపి గెలిచిన దాఖలాలు లేవన్నారు. సింబల్ ఎలక్షన్లు వస్తే జగన్ కి ఓటేస్తారని అన్నారు మంత్రి రోజా. టిడిపికి అంత నమ్మకం ఉంటే లోకేష్ ను ఎందుకు పోటీలో పెట్టలేదని ప్రశ్నించారు. 2024 ఎన్నికలలోను జగన్ తోనే ప్రజలు ఉంటారని అన్నారు. చంద్రబాబుది గాలి పార్టీ అని ఎద్దేవా చేశారు. పులివెందులలో జగన్ ను ఓడించే మగాడు ఇంకా పుట్టలేదని.. దమ్ముంటే చంద్రబాబు పులివెందులలో పోటీ చేయాలని రోజా సవాల్ విసిరారు.