ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది హైకోర్టు. విద్యాశాఖ బిల్లుల చెల్లింపు అంశంపై ఈరోజు హైకోర్టులో వాయిదా ఉండగా.. వాయిదాకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రావత్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, విద్యాశాఖ కార్యదర్శి సురేష్ కుమార్ హాజరయ్యారు. కాగా ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ కోర్టుకు గైర్హాజరయ్యారు.

విద్యాశాఖ బిల్లుల చెల్లింపులో జాప్యం పై హైకోర్టులో వాదనలు జరిగాయి. అయితే హైకోర్టుకు గైర్హాజరైన సత్యనారాయణకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్.