టిటిడి భక్తులకు గమనిక.. ఏప్రిల్ 8కి వాయిదా పడిన టోకెన్ల జారీ..!

-

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వృద్ధులు, దివ్యాంగులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇటీవల టీటీడీ ప్రకటించింది. అందుకు సంబంధించి గురువారం నాడు దర్శన టికెట్లు జారీ చేయాల్సి ఉండగా.. సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో టోకెన్ల జారీని టీటీడీ ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఈ విషయాన్ని టీటీడీ స్వయంగా వెల్లడించింది. ఆయా టోకెన్‌లను ఏప్రిల్ 8వ తేదీ ఉ.11 గంటలకు టోకెన్లు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.

 

 

 

 

వృద్ధులు, దివ్యాంగులు శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ ఉ.10 గంట‌లకు, శుక్రవారం అయితే మ.3 గంట‌లకు భక్తులకు అనుమ‌తి ఇవ్వనుంది. అటు అంగప్రదక్షిణం టోకెన్‌ల జారీని ఏప్రిల్ 2వ తేదీకి టీటీడీ వాయిదా వేసింది.కాగా నిత్యం గోవింద నామ స్మరణలతో మారుమోగే ఏడుకొండలు కరోనా ప్రభావంతో చరిత్రలో తొలిసారిగా 2020 మార్చి 20న శ్రీవారి దర్శనాలకు భక్తుల అనుమతిని తాత్కాలికంగా రద్దు చేసింది. కరోనా కారణంగా శ్రీవారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తూ వస్తోంది. కల్యాణోత్సవ సేవను మాత్రం వర్చువల్‌గా నిర్వహిస్తోంది. ఇటీవల కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత, నిత్య సేవలలో ప్రత్యక్షంగా భక్తులు పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. అంతేకాకుండా వయో వృద్ధులకు, వికలాంగులకు కల్పించే దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news