అమరావతికి మా ప్రభుత్వం వ్యతిరేకం కాదు – బొత్స

-

అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని.. వికేంద్రీకరణ తోనే రాష్ట్రమంతా అభివృద్ధి జరుగుతుందని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తమ ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనని అన్నారు. విశాఖలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి బొత్స. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని ప్రతిపాదన ఇచ్చిన సంస్థకు కోట్ల రూపాయల ఫీజు ఇచ్చారని.. అక్కడ నిర్మాణ ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని అన్నారు.

విశాఖలో మాత్రం తక్కువ అవుతుందని చెప్పారు. అమరావతిలో అంత ఖర్చు అవసరమా అని తాము ఆలోచన చేసామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నామని వివరించారు. శ్రీ బాగ్ ఒప్పందం మేరకే కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తున్నామన్నారు. టాప్ 5 సిటీస్ లో విశాఖ ఉందని.. విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news