తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్ట భద్రులకు బిగ్ అలర్ట్. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీకి ఓటు నమోదుకు డిసెంబరు 9వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఓటు నమోదుకు డిగ్రీ జిరాక్స్ పత్రాలను ఇచ్చే సమయంలో గెజిటెడ్ సంతకం అవసరం లేదని అధికారులు ప్రకటించారు.
ఓటరు వెరిఫికేషన్ కు బీఎల్వీలు ఇంటికి వచ్చినప్పుడు తనిఖీ అధికారికి ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్ ను చూపించాలని తెలిపారు. లేనిపక్షంలో అప్పుడు గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన జిరాక్స్ పత్రాన్ని ఇవ్వాలని అధికారులు వివరించారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా ఓటు నమోదు చేసుకునేందుకు అర్హత ఉంటుందట. ఇక ఈ నెల 23న ఓటర్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఉంటుందని చెబుతున్నారు. వచ్చేనెల 30న ఓటర్ల తుది జా బితా ప్రచురణ చేస్తారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.