జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగానే… గెలిచే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాక మరియు భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు.

అయితే ఈసారి ఎలాంటి తప్పిదం జరగకుండా ఖచ్చితంగా గెలవాలని పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో 91,000 కాపుల ఓట్లు ఉన్నాయి. కాపు ఓట్లన్నీ జనసేనకు పడతాయని పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే… పవన్ కళ్యాణ్ భారీ విజయానికి లోక ఉండదని జనసేన వర్గాలలో బలంగా ఉంది.