హనుమ విహారి ఎపిసోడ్‌ పై రఘురామ సంచలన వ్యాఖ్యలు !

-

హనుమ విహారి ఎపిసోడ్‌ పై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి టెస్ట్ క్రికెట్లో ప్రాతినిధ్యం వహించిన హనుమ విహారిని ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ గా తప్పించాలని తిరుపతి పట్టణానికి చెందిన ఒక కార్పోరేటర్ చేసిన ఒత్తిడితో దిక్కుమాలిన రాజకీయాలకు ఆయన బలయ్యారని రఘురామకృష్ణ రాజు అన్నారు. ఆంధ్ర రంజీ జట్టులో 17వ ఆటగాడిగా తిరుపతి పట్టణానికి చెందిన ఒక కార్పొరేటర్ కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని, 17వ ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్ లోకి సాధారణంగా వెళ్లరని, అయితే ఆంధ్ర రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ తనయుడు ఏకంగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లడంతో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హనుమ విహారి గారు మందలించినట్లు తెలిసిందని వెల్లడించారు.

దీనితో కార్పొరేటర్ తనయుడు అలిగి తండ్రికి ఫిర్యాదు చేయడంతో, కాపు కులానికి చెందిన హనుమ విహారి గారిని కెప్టెన్ గా తప్పించాలని సదరు కార్పొరేటర్ ఒత్తిడితో తిరుపతికి చెందిన ఇద్దరు కీలక నేతల ప్రమేయంతో హనుమ విహారి గారిని కెప్టెన్ గా తప్పించారని అన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను నిర్వహిస్తున్నామని చెప్పి, వారిని వీరిని తీసుకువచ్చి ఆటలు నేర్పిస్తామన్న ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాడి పట్ల ఇంత అవమానకరంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ( ఏసీఏ) ను ఎందుకు మందలించలేదని ప్రశ్నించారు. ఏసీఏ అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా రోహిత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గోపీనాథ్ రెడ్డి లు కొనసాగుతున్నారని, ఈ ముగ్గురు కూడా విజయసాయిరెడ్డి గారికి సన్నిహితులేనని, వీరెవరికి క్రికెట్ ఆడడం రాదు… చూడడం తప్ప అని రఘురామకృష్ణ రాజు గారు అపహాస్యం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news