టెక్నాలజీ వాడాలంటే చంద్రబాబు తరువాతే ఎవరైనా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. విజయవాడలో చోటు చేసుకున్న వరదలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. వరదల నుంచి ప్రజలను చంద్రబాబు నాయుడు చాలా బాగా కాపాడరని వెల్లడించారు. ముఖ్యంగా డ్రోన్లు పెట్టి… బాధితులను ఆహారం పంపించారని కొనియాడారు.
వీడియోలు, ఫోటోలు చూపించి మరీ టెక్నాలజీ వాడాలంటే చంద్రబాబు తరువాతే ఎవరైనా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. ఇక ఇవాళ కాకినాడ కలెక్టర్ కి ఫోన్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… గోదావరికి వరద ఉధృతి పెరిగిందని అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. ఏలేరు కాలువ కి వరద నీరు ఏ మేరకు వస్తుందని అడిగి తెలుసు కున్న పవన్… రైతుల ను సన్నద్ధం చేయాలని సూచించారు.