కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ!

-

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఇప్పటికే ఆయనకు ఈడీ కేసులో బెయిల్ లభించగా..సీబీఐ కేసులో ఆయన ఇంకా తిహార్ జైలులోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం గురువారం విచారించనుంది. ఆయనకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరపున లాయర్ ధర్మాసనాన్ని కోరే అవకాశం ఉంది. లిక్కర్ స్కాం అనేది కేవలం పేపర్లలో క్రియేట్ చేసిన ఆరోపణలు అని అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆప్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

CM Arvind Kejriwal approaches Delhi High Court

కాగా, ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత,అప్రూవర్‌గా మారిన సుఖేశ్‌కు సైతం బెయిల్ లభించింది. కేవలం కేజ్రీవాల్ మాత్రమే ప్రస్తుతం లిక్కర్ స్కాం కేసులో జైలులో ఉంటున్నారు. కవితకు బెయిల్ రావడంతో ఆయనకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఆప్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. సుప్రీంకోర్టు సైతం ఇటీవల బెయిల్ మంజూరు చేసే అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ అనేది ఒక నియమం అని.. అది అందరికీ వర్తిస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news