అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలి – పవన్ కళ్యాణ్

-

అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైందని.. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని చెప్పారు. వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారని.. బాధిత రైతులకు అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని వివరించారు.

దెబ్బ తిన్న పంటల గణనను సత్వరమే చేపట్టి, మానవతా దృక్పథంతో నష్ట పరిహారాన్ని చెల్లించాలని.. వరి సాగు చేసిన రైతులను ఈ వర్షాలు తీవ్రంగా దెబ్బ తీశాయని పేర్కొన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.ధాన్యం కొనుగోలు పకడ్బందీగా సాగటం లేదని.. గోదావరి జిల్లాల్లో సాగు చేసిన జయ రకం (బొండాలు) ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు.
దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు… ఆర్బీకేల్లో తీసుకోకపోవడం వల్ల బస్తాకు రూ.300 నష్టంతో మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ వైఖరి మూలంగా కష్టపడిన రైతు నష్టపోతున్నాడు.. దళారులు, మిల్లర్లు లాభపడుతున్నారు… అదే విధంగా మామిడి నేల రాలిపోయింది. మొక్క జొన్న కూడా మొలకెత్తిపోతోందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news