BREAKING: కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు !

-

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు టూర్ ఖరారు అయింది. ఈ పర్యటనలో కర్ణాటక అటవీ శాఖ మంత్రితో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్. ఎర్రచందనం అక్రమ రవాణ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు నిర్వహించనున్నారని సమాచారం. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్ర చందనం దోపిడీని అరికట్టేలా పవన్ ప్రణాళికలు చేస్తున్నారు.

ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడి కలిసి పని చేయాలని అటవీ శాఖ మంత్రిని కోరనున్నారు పవన్. కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని కోరనున్నారు డిప్యూటీ సీఎం పవన్‌. పొలాల మీద పడే ఏనుగుల మందను తరమడానికి కుంకీ ఎనుగులు అవసరమని చెప్పారు అటవీ శాఖ అధికారులు.

ఏపీలో అందుబాటులో కేవలం రెండు కుంకీ ఏనుగులే ఉన్నాయి. కుంకీ ఎనుగుల కొరతతో ఊళ్ల మీద పడే ఏనుగుల మందను తరమలేకపోతోంది అటవీ సిబ్బంది. కర్ణాటకలో కుంకి ఏనుగులు లభ్యత ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కు చెప్పారట అధికారులు. తానే స్వయంగా కర్ణాటక ప్రభుత్వాన్ని కోరతానని గతంలోనే చెప్పిన పవన్…ఇప్పుడు చర్చలకు సిద్ధం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news