వైసీపీ గూండాలకు నరకం చూపిస్తా : పవన్ కళ్యాణ్

-

జనసేనకు అధికారం ఇస్తే వైసిపి గుండాలకు నరకం చూపిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ‘నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. నేరచరిత్ర ఉన్నవాళ్లు, ఈ సన్నాసుల, ఈ దరిద్రులా మనల్ని పాలించేది. గూండాలు, రౌడీలు, హంతకులు… సిగ్గుండాలి మనకు ఇలాంటి నేరచరిత్రల చేత పాలించబడేందుకు. మధ్యతరగతికి హాని చేస్తే బట్టలూడదీసి కొడతా’ అని వార్నింగ్ ఇచ్చారు.

ఉప్పాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాకు అధికారం ఇవ్వండి, ఆర్జిస్తున్నాను, అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు. నేను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను గెలవడానికి ఏ వ్యూహం అయిన వేస్తానని తెలిపారు. పిచ్చి వాగుడు వాగితే బయటకు తీసుకు వచ్చి కొడతాను. జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండా కొడుకులకు నరకం చూపిస్తానని వార్నింగ్‌ ఇచ్చారు పవన్ కళ్యాణ్‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news