ఇవాళ ఇప్పటంలో పవన్ కళ్యాణ్ పర్యటన..అరెస్ట్ తప్పదా !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మంగళగిరిలోని ఇప్పటంలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలు, ఇల్లు, దుకాణాలు కోల్పోయిన వారికి పార్టీ తరపున పరిహారం అందించనున్నారు. ఈనెల 4వ తేదీన ఇప్పటం గ్రామంలో అధికారులు రహదారి విస్తరణ పేరిట ఇల్లు ఇతర నిర్మాణాలను తొలగించిన సంగతి తెలిసిందే.

అప్పట్లో దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా ఇప్పటం గ్రామానికి వచ్చి బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందునే ఇప్పటం గ్రామంలో ఇల్లు కూల్చివేసారని పవన్ ఆరోపించారు. రోడ్డు విస్తరణలో ఇల్లు, దుకాణాలు కోల్పోయిన వారికి రూ. లక్ష పరిహారం ప్రకటించారు. ఆ పరిహారాన్ని అందించేందుకు పవన్ కళ్యాణ్ ఇవాళ ఇప్పటం రానున్నారు.