నిన్న చంద్రబాబు నాయుడు ర్యాలీ కారణంగా గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు.నిన్న ఘటన అనంతరం బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో చిత్తూరులో మంత్రికి భారీగా స్వాగతం పలికాయి పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయంగా దివాలా తీశారని ఆగ్రహించారు.
అంతులేని ఆవేదన, ఆలోచనతో బాధ పడుతున్నారని ఫైర్ అయ్యారు. పుంగనూరు బైపాస్ నుండి వెళ్తాం అని పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చారని.. ఆ తర్వాత కావాలనే పుంగనూరు లోకి వెళ్ళాలని ప్రయత్నించారని నిప్పులు చెరిగారు. ఆ తర్వాత వారు పోలీసులపై విచక్షణంగా దాడి చేశారని..చంద్రబాబు రెచ్చగొట్టి టిడిపి కార్యకర్తలను పోలీసులపై దాడికి పాల్పడేలా చేశారని ఆరోపించారు. అనరాని మాటలు తిడుతూ ప్రజలను రెచ్చగొట్టారు… పోలీసులపై ఈ స్థాయిలో దాడి జరిగిన ఘటనలు ఇటీవల కాలంలో లేవన్నారు. కుప్పం అనగానే చంద్రబాబు కు ఓటమి, పెద్దిరెడ్డి గుర్తొస్తారు..అందుకే ఈ దాడులకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు… 200 వాహనాల్లో రౌడీలను తెచ్చుకున్నారని ఆరోపించారు.