ఏపీలోని గ్రామ వాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. అమరావతిలో భూమిలేని గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు పింఛన్ మంజూరు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మార్చి ఒకటో తేదీ నుంచి పింఛన్ పంపిణీ చేస్తామని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి పేర్కొన్నారు. కొందరు అమరావతి వాలంటీర్లు పింఛన్ అంశాన్ని తన దృష్టికి తీసుకు వచ్చారని వివరించారు. ఆ సమస్యను సీఎం జగన్ కు తెలపగా పింఛన్ ఇవ్వాలని ఆయన ఆదేశించినట్లు శ్రీలక్ష్మి స్పష్టం చేశారు. దీంతో 200 మంది వాలంటీర్ల కుటుంబాలకు… ఈ పింఛన్ సదుపాయం అందనుంది.