నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భ‌ర్తీకి అనుమ‌తి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవ‌ల ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం.. గ్రూప్ – 1, గ్రూప్ – 2 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న విషయం తెలిసిందే. తాజా గా నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెబుతూ.. ఉద్యోగాల భ‌ర్తీకి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమ‌తులు జారీ చేసింది. గ్రూప్ – 1, గ్రూప్ – 2 ఉద్యోగాల భ‌ర్తీ చేయాల‌ని ఏపీపీఎస్సీ కి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమ‌తులు ఇచ్చింది.

దీంతో అతి త్వ‌ర‌లోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ – 1, గ్రూప్ – 2 ఉద్యోగాల భ‌ర్తీ కి నోటిఫికేషన్ విడుద‌ల కానుంది. కాగ 110 గ్రూప్ – 1, 182 గ్రూప్ – 2 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి ఆర్థిక శాఖ అనుమ‌తి ఇచ్చింది. మొత్తంగా 292 ఉద్యోగాల‌కు త్వ‌ర‌లోనే నోటిఫికేషన్లు విడుద‌ల కానున్నాయి. గ్రూప్ – 1 విభాగంలో డిప్యూటీ క‌లెక్ట‌ర్లు, సీటీవోలు, జిల్లా రిజిస్ట్రార్లు, డీఎస్‌పీ ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే గ్రూప్ – 2 లో డిప్యూటీ త‌హ‌సీల్దార్లు, స‌బ్ రిజిస్ట్రార్ గ్రేడ్ – 2 తో పాటు మున్సిప‌ల్ క‌మిషన‌ర్ గ్రేడ్ – 3 స‌హా మ‌రి కొన్ని ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news