ఏపీలో అత్యంత తెలివైన వాడు కొడాలి నాని – పేర్ని నాని

-

గుడివాడ ఆర్టీసీ డిపో ను పేర్ని నాని, కొడాలి నాని, సింహాద్రి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడారు. పది కోట్లతో గుడివాడ బస్టాండు నిర్మాణానికి టెండర్ పిలవబోతున్నామని వెల్లడించారు. మే 19న సీఎం జగన్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేస్తామని వివరించారు.

8900 ఇళ్ళను సీఎం జగన్ అందజేస్తున్నారని.. కొత్త పంపుల చెరువు గుడివాడలో పెట్టడానికి 40 నుంచీ 50 కోట్లు మంజూరు చేయనున్నారని వివరించారు. రాజకీయాలలో ఈ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యంత తెలివైన వాడు కొడాలి నాని అని ప్రశంసించారు పేర్ని నాని. కొడాలి నాని తో పోటీపడటానికి ఇద్దరు కొట్టుకుంటున్నారు…ఈ సారి కూడా గుడివాడలో గెలిచేది కొడాలి నానినే తేల్చి చెప్పారు పేర్ని నాని. ఊళ్ళో ఎక్కడ వర్షం వచ్చినా గతంలో గుడివాడ డిపో గ్యారేజీ వర్షం లో మోకాలు లోతు మునిగేది… గుడివాడ బస్ డిపో గ్యారేజీ ని కొడాలి నాని బాగు చేసా రని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news