భీమ్లా నాయక్ సినిమా అట్టర్ ఫ్లాఫ్..అందుకే రూ.30 కోట్లు నష్టం వచ్చిందని ఫైర్ అయ్యారు పేర్ని నాని. టీడీపీ కోసమే పవన్ పార్టీ పెట్టాడు.. టీడీపీ పది కాలాల పాటు పచ్చగా ఉండాలనుకునే వ్యక్తి పవన్‌కల్యాణ్ అని ఎద్దేవా చేశారు. జగన్‌ను తిట్టడానికే పవన్ రోడ్ల మీదకు వస్తున్నాడు.. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబు కోసం పవన్ తిరుగుతున్నారని ఆగ్రహించారు పేర్ని నాని.
భీమ్లా నాయక్ సినిమాకు జగన్ 30 కోట్లు నష్టం కలిగించారని అబద్దాలు చెప్పాడు.. పవన్ కళ్యాణ్ సినిమా మార్కెట్ ఎంత?? అని ప్రశ్నించారు. పవన్ ఏమైనా పెట్టుబడి పెట్టాడా?? సినిమా బాగోకపోతే ప్రజలు ఎందుకు చూస్తారు?? అని నిలదీశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి , జగన్ కు ఏం సంబంధం ఉంటుంది?? వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు చేస్తే జనాలు చూస్తారని వివరించారు. చిరంజీవి వల్ల సినిమాల్లోకి వచ్చి ఇవాళ ఆయన పేరు కూడా ఎత్తటం లేదని ఆగ్రహించారు పేర్ని నాని.