BIG BREAKING : చంద్రబాబుకు భారీ షాక్.. కరకట్టపై గెస్ట్‌హౌస్ ‌అటాచ్ చేసిన ఏపీ సర్కార్

-

BIG BREAKING : అమరావతి స్కాంలో చంద్రబాబుకు షాక్‌ తగిలింది. అమరావతి స్కాంలో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. చంద్రబాబు సహా మరికొందరి ఆస్తుల ఆటాచ్‌ చేసింది. కరకట్టపై చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేసింది ఏపీ ప్రభుత్వం. క్రిమినల్‌ లా అమెండమెంట్‌ 1944 చట్టం ప్రకారం అటాచ్‌ చేసిన అధికారులు..వీటితోపాటు మరికొందరి టీడీపీ నాయకులు ఆస్తులనూ అటాచ్‌ చేశారు.

ప్రజా ప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నారాయణలు కుట్ర, విశ్వాసఘాతుకం, మోసం, ప్రభుత్వంలో ఉంటూ నేరపూరిత ప్రవర్తనకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. అక్రమ పద్ధతుల్లో గెస్ట్‌హౌస్‌ పొందారని అభియోగాలు వచ్చాయి. క్రిడ్‌ప్రోకోలో భాగంగా ఉచితంగా లింగ మనేని నుంచి గెస్ట్‌హౌస్‌ పొందారని అభియోగాలు బయట పడ్డాయి.

అమరావతి కేపిటల్‌ సిటీ మాస్టర్‌ప్లాన్‌లోనూ, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లోనూ, కంతేరు, కాజ, నంబూరుల్లో జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రణాళికల్లోనూ అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. వ్యాపారి లింగమనేని అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్‌ తీసుకున్నారని చంద్రబాబుపై అభియోగం ఉంది. ఈ నేపథ్యంలో క్రిమినల్‌ లా అమెండమెంట్‌ 1944 చట్టం ప్రకారం అటాచ్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది సీఐడీ. దీంతో చట్టం ప్రకారం అటాచ్‌ చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

https://www.youtube.com/live/wYyDYdYn-eY?feature=share

Read more RELATED
Recommended to you

Latest news