ఎంత మంది దిగి వచ్చినా.. కొడాలి నానిని ఓడించ లేరు – పేర్ని నాని

ఎంత మంది దిగి వచ్చినా.. కొడాలి నానిని ఓడించ లేరన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. కొడాలి నానిని చంద్రబాబు 2004కు ముందు ఉన్న వ్యక్తిగానే అనుకుంటున్నాడని.. జగన్ ను ఎలా ఓడించాలి, అధికారంలోకి రావాలని అని కాకుండా కొడాలి నానిని ఎలా ఓడించాలి అనే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.

గుడివాడకు ఒక బ్రాండ్ తెచ్చిన వ్యక్తి కొడాలి నాని అని.. గుడివాడలో కొడాలి నానిని ఓడించటం కాదు కదా అసలు టీడీపీ నుంచి నిలబడే వ్యక్తి ఎవరు?? అని ప్రశ్నించారు. ఎంత మంది దిగి వచ్చినా కొడాలి నానిని ఓడించ లేరు.. .పేద ప్రజలకు ఇస్తున్న ఇళ్ళ స్థలాల పై లోకేష్ విమర్శలు చేస్తున్నాడని ఆగ్రహించారు.

రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కొడాలి నానిని చూస్తూ, ముచ్చటపడుతూ వస్తున్నానన్నారు. నేను కాంగ్రెస‌లో ఉన్నప్పుడు కొడాలి నానిని కాంగ్రెస్‌లోకే తీసుకుని వెళ్ళాలి అనుకున్నాను.. కొడాలి నాని నా స్నేహితుడని చెప్పుకోవటానికి జీవితాంతం గర్వపడుతానని చెప్పారు. ఈ నియోజకవర్గ ప్రజలు ఇంకా అదృష్టవంతులు అని కొనియాడారు.