పవన్ కళ్యాణ్ జంపింగ్ జపాంగ్ వీరుడు – పేర్ని నాని

-

కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ ది అంటూ సెటైర్లు పేల్చారు పేర్ని నాని. పవన్ కళ్యాణ్ జంపింగ్ జపాంగ్ వీరుడంటూ విరుచుకుపడ్డారు.అర్జునుడు అయితే ద్రౌపదిని కాపాడాలి అంటారు…అర్జునుడికి, ద్రౌపదికి మధ్య సంబంధం ఏంటో వీళ్ళకు తెలియదన్నారు. ఇవాళ అసెంబ్లీలో పేర్ని నాని మాట్లాడుతూ…జగన్ జనంలోకి వెళుతుంటే టీడీపీ, జనసేన షేక్ అవుతున్నాయని చురకలు అంటించారు.

perni nani on pawan kalyan janasena

హామీలు అమలు చేయలేదని మోడీ కూడా చంద్రబాబును ఎందుకు నిలదీయ లేదు?? ఒక్క సీటు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ను సీఎం చేయటం కోసమే పాకులాడతాడని చురకలు అంటించారు. 2014లో జగన్ కు ఇప్పటికి చాలా తేడా ఉంది….మళ్ళీ అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమేనన్నారు. చంద్రబాబు కు మతి చెడిందా?? అంటూ ఆగ్రహించారు.

పేర్ని నాని సర్వర్ ఉద్యోగం చేస్తున్నాడు అని చంద్రబాబు అంటున్నాడు…నేను వస్తే సాఫ్ట్ ‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తాను అన్నాడన్నారు. కార్యకర్తలకు భోజనం పెడితే అంత చులకనగా కనిపిస్తున్నామా?? సర్వర్లు మనుషులు కాదా?? చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం అంటూ ఫైర్‌ అయ్యారు పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Latest news