వినియోగదారులకు షాక్… మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

మళ్లీ పెట్రోల్ ధరలు భగ్గుమన్నాయి. వరసగా పెరుగుతున్న ధరలు వాహనాదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. తాజాగా మరోమారు పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరలు సామాన్యుడికి శరాఘాతంగా మారాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, డిజిల్ పై 37 పైసలు పెరిగాయి. ఇన్నాళ్లు పెట్రోల్ ధరలు మాత్రమే సెంచరీ దాటగా, ప్రస్తుతం డిజిల్ ధరలు కూడా సెంచరీని దాటి పెట్రోల్ ధరలకు తీసిపోని విధంగా పెరుగుదలను నమోదు చేసుకుంటుంది. 

తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.109 ఉండగా లీటర్ డిజిల్ ధర రూ.102.04 గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.88, లీటర్ డిజిల్ ధర రూ. 103.33గా ఉంది. వరసగా పెరగుతున్న ధరల కారణంగా ప్రజల నిత్యవసరాలపై కూడా ప్రభావం సడుతోంది. డిజిల్ రేట్ల పెరుగుదలతో రవాణా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా ప్రజలకు నిత్యవరాల ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయి.