దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా బిజెపి పార్టీ 400 సీట్లు గెలవాలని ముఖ్య లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇక ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు కూడా రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది బిజెపి పార్టీ.
మే 7, 8వ తేదీలలో పలు ప్రాంతాలలో బహిరంగ సభలు, రోడ్ షోలలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. మే 7వ తేదీన నాలుగు గంటలకు రాజమహేంద్రవరం వేమగిరి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు అనకాపల్లి బహిరంగ సభలో పాల్గొంటారు. మే 8వ తేదీన పీలేరు బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం విజయవాడలో రోడ్ షో కూడా చేస్తారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ మెరకు షెడ్యూల్ కరారు అయింది.