తిరుమల ట్రాన్స్ ఫోర్ట్  జీఎం పై పోలీసుల సీరియస్..!

-

తిరుమల బస్సు మిస్సింగ్‌ కలకలం రేపింది. ఇవాళ తిరుమలలో ఉన్న టీటీడీ ఉచిత బస్సు మిస్ అయింది. ఇవాళ ఉదయం 3 గంటలకు ఎలక్ట్రిక్‌ బస్సు జియన్ సి టోల్ గేట్‌ దాటినట్లు గుర్తించారు విజిలేన్స్ అధికారులు. గత వారం రోజుల క్రితం కూడా ఎలక్ట్రిక్ కారు కూడా మిస్సింగ్ అయిందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒంటిమిట్ట రామాలయం వద్ద కారును గుర్తించారు భధ్రతా సిబ్బంది. దీంతో  తిరుమల ట్రాన్స్ ఫోర్ట్ జీఎం పై పోలీసులు సీరియస్ అయ్యారు.

TTD free bus missing
TTD free bus missing

బస్సు మిస్ మీడియాలో వచ్చేంత వరకు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో.. ఎఫ్ఆర్ లో నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.  ట్రాన్స్ ఫోర్ట్ జీఎం పేరు ఎఫ్ఐఆర్ లో నమోదైతే.. జీఎం ను సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నారు టీటీడీ అధికారులు. వాస్తవానికి భక్తులను తరలించే వాహనాలను ఫిట్ నెస్ పూర్తి స్థాయిలో ఉందా లేదా వాటి భద్రతా వంటి అన్ని విషయాల్లో జీఎం బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీంతో బస్సు మిస్ కేసులో జీఎం కు మెమో జారీ చేశారు. AP39UP 2757 నెంబర్ గల బస్సు తమిళనాడు వైపు వెళ్తున్న ఎలక్ట్రికల్ బస్సు.. చార్జింగ్ అయిపోవడంతోనే బస్సు ఆగిపోయింది. దీంతో బస్సు ఆచూకి లభించింది. ఒకవేళ ఛార్జింగ్ కూడా ఉన్నట్టయితే.. ఆ బస్సు ఆచూకి కూడా లభించేది కాదని చెబుతున్నారు పోలీసులు. 

Read more RELATED
Recommended to you

Latest news