తక్కువచేసుకోకు.. రెండో తప్పుచేయకు జగన్!

-

2019లో వైకాపా ప్రభంజనానికి కారణం ఎవరు? చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులు.. జగన్ పై జనం పెట్టుకున్న నమ్మకాలు! ఇది వాస్తవం.. కానీ… ఆ కష్టాన్ని, క్రెడిట్ ని ప్రశాంత్ కిశోర్ (పీకే) టీం కి ఇచ్చే తప్పుచేశారు వైకాపా నేతలు, అధిష్టానం అని వైకాపా కార్యకర్తలు ఫీలవుతుంటారు. కష్టం జగన్ ది, కార్యకర్తలది అయితే… ఆ ప్రతిఫలాన్ని మాత్రం పీకే ఖాతాలో వేస్తున్నారని అప్పట్లో కామెంట్లు వినిపించేవి. ఈ క్రమలో మళ్లీ అదేతప్పు జగన్ చేయబోతున్నారని గాసిప్స్ వస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే… 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం వీచింది. ఈ అఖండ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉందని దేశమంతా చెప్పుకుంటున్నారు. అది వాస్తవం కాకపోయినా.. అతడికి మాత్రం మైలేజ్ వస్తుంది.. తద్వారా ఇలాంటి ప్రాజెక్టులు వస్తు ఉన్నాయి. అందులో భాగంగానే.. జగన్ పాదయాత్రతో కలిపి పార్టీ కోసం పాటుపడ్డ కష్టం అంతా.. తన ఖాతాలో వేసుకొని తమిళనాడులో డీఎంకే కాంట్రాక్టును కొట్టేశాడు ప్రశాంత్ కిషోర్.. ఆ విషయం ప్రస్తుతానికి అప్రస్తుతం అనుకోండి… అది వేరే విషయం! అయితే ఇప్పుడు ఏపీలో విజయానికి కారణం ప్రశాంత్ కిషోర్ టీం అని నమ్ముతూ.. తనను తాను తక్కువచేసుకుంటూ, వైకాపా కార్యకర్తల మనోభావాలను ఇబ్బందిపెడుతున్న జగన్.. మరోసారి పీకే టీంను పిలుస్తున్నారంట!

పరిపాలన గ్రామస్థాయిలో జరగాలని, అప్పుడే సామాన్యులకు ప్రభుత్వ పథకాలు అవినీతికి తావులేకుండా అందుతాయని నమ్మిన జగన్.. సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను పెట్టి.. ప్రభుత్వ పథకాలు అన్నీ డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో వాలంటీర్స్ సరిగా చేయడం లేదు అని రిపోర్టులు వస్తున్నాయని, కాబట్టి వారిని పర్యవేక్షించేందుకు వాలంటీర్ల వ్యవస్థ మీద సూపర్వైస్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రశాంత్ కిషోర్ ను మళ్లీ తీసుకుంటున్నారని.. అతడికే పథకాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పజెప్ప బోతున్నారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది.

దీంతో… జగన్ మళ్లీ తప్పుచేస్తున్నాడని అంటున్నారు విశ్లేషకులు. “తాను పీకేని నమ్మినా… తనను మాత్రం జనం నమ్మారన్న విషయం జగన్ మరిచిపోతున్నారు”! వాలంటీర్లపై నిఘాపెట్టాలంటే వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలి కానీ, వ్యక్తులను నమ్ముకుని కాదు అని సూచనలు వస్తున్నాయి. పైగా… వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది అంతా యువకులు.. జాబ్ వచ్చిన కొత్తలో కాస్త అత్యుత్సాహం చూపించి ఉండొచ్చు.. అంతమాత్రాన్న వారిపై పీకే టీం ను రప్పించి, పెత్తనం చేయించడం మంచిది కాదని అంటున్నారు.

మరి ఈ విషయంలో జగన్ పునరాలోచించుకుంటారా లేక తనకు పీకేనే ముఖ్యమని, తనకు ఈ సీఎం బిక్ష పెట్టింది పీకేఅని మరోసారి నమ్ముకుంటారా అనేది వేచి చూడాలి! పైగా పీకే టీంతో పని అనేది కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం! మరి ఈసారి పీకే టీం కి వైకాపా డబ్బులు ఇస్తారా లేక ఆర్థికంగా ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ఖజానా నుంచే ఇస్తారా అనేది కూడా పెద్ద ప్రశ్నే!

Read more RELATED
Recommended to you

Latest news