చంద్రబాబుకు తలనొప్పిగా మారిన ప్రొద్దుటూరు టిడిపి టికెట్ వ్యవహారం..

-

టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ప్రొద్దుటూరు టిడిపి టికెట్ వ్యవహారం తలనొప్పిగా మారింది.. టికెట్ తమదంటే తమదంటూ నియోజకవర్గంలోని నలుగురు నేతలు పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారు.. ఇంతకీ ప్రొద్దుటూరు టిడిపిలో ఏం జరుగుతుందో ఓ లుక్కెద్దాం..

ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జిగా ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు.. ఆయనతోపాటు
టిడిపి మాజీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, లింగారెడ్డి, బిజెపి నేత సీఎం రమేష్
సోదరుడు సురేష్ లు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. వరదరాజులు రెడ్డయితే ఒక్క అడుగు ముందుకేసి జనంలో తిరుగుతున్నారట.. టికెట్ తనకే వస్తుందని అందరూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారట.. ఈ విషయం తెలిసిన ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారట.. ఇన్చార్జిగా ఉంటూ జైలుకెళ్ళిన తనకు కాదని ఇంకొక టికెట్ ఇస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది.. అయితే బిజెపి నేత సీఎం రమేష్ మాత్రం తన తమ్ముడికి టికెట్ ఇచ్చేందుకు చాప కింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇటీవల హైదరాబాద్ లో చంద్రబాబును కలిసిన సీఎం రమేష్.. తన తమ్ముడికి టికెట్ ఇవ్వాలని.. పార్టీ ఫండింగ్ చూసుంటానని చెవిలో ఊది వచ్చారట.. దీంతో సీఎం రమేష్ తమ్ముడు సురేష్ కూడా టికెట్ ధీమాలో ఉన్నారు.. టిడిపి తరఫున ఎవరు బర్లో దిగిన ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. ఇంతకీ పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్ లభిస్తుందా లేక పార్టీ ఫండ్ ఇచ్చిన వారికి టికెట్ వస్తుందా అని చర్చ పార్టీలో నడుస్తుంది…

Read more RELATED
Recommended to you

Latest news