ఖమ్మం ఎంపీ సీటు కోసం పోటాపోటీ

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది.. తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.. గెలుపు అసాధ్యం అనుకున్నా నియోజకవర్గాల్లో కూడా బలమైన నేతలను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ పెద్దలు సిద్ధమవుతున్నారు.. అయితే ఖమ్మం ఎంపీ సీటు కోసం ఇద్దరు ప్రముఖులు ప్రధానంగా పోటీపడుతున్నారు.. ఒకరు కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి అయితే.. మరొకరు పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి.. వీరిద్దరూ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు..
ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉంటే వాటిల్లో తొమ్మిది స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.. దీంతో ఉమ్మడి ఖమ్మం నుంచి రేవంత్ క్యాబినెట్ లో ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగుతున్నారు.. వీరిలో భట్టి విక్రమార్క తో పాటు పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి , తుమ్మల నాగేశ్వరావు ఉన్నారు..

ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలంటూ మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలను కోరింది.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి అండగా ఉన్నానని.. తనను గుర్తించాలంటూ ఆమె సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారట.. మరోపక్క మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఖమ్మం జిల్లాలో టాక్ నడుస్తోంది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకు తన అన్న పొంగులేటి శ్రీనివాసులు రెడ్డికి విస్తృత పరిచయాలు ఉన్నాయని.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తాను పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేశానని కాంగ్రెస్ హాయ్ కమాండ్ కు ఇప్పటికే వేగులు ద్వారా సమాచారం ఇచ్చారట.. తనకు అవకాశం కల్పిస్తే భారీ మెజార్టీతో ఖమ్మం సీటును కైవసం చేసుకుంటానని చెబుతున్నారట. పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి సైతం తన తమ్ముడికి టికెట్ ఇప్పించేందుకు పార్టీలో ఉన్న పెద్దలందరితో టచ్ లోకి వెళ్లారట.. తన తమ్ముడు టికెట్ ఇచ్చేందుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారట.. మొత్తంగా ఖమ్మం ఎంపీ స్థానం కోసం ఇద్దరు ప్రముఖులు పోటాపోటీగా బరిలో ఉండడంతో టికెట్ ఎవరికి వరిస్తుందోనని పార్టీలో చర్చ మొదలైంది

Read more RELATED
Recommended to you

Latest news