ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ : నిర్మలా సీతారామన్

-

Nirmala Sitharaman: ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం ఇస్తామని కూడ వెల్లడించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం ఉంటుందని చెప్పారు. పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయింపులు చేస్తామని వెల్లడించారు. ముద్ర లోన్ పరిమితిని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.10 లక్షల లోన్ ఇస్తుండగా.. తాజా బడ్జెట్‌‌లో దాన్ని రూ.20లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ లోన్స్‌ను వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందిస్తాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news