వివేకా రక్తపు మరకలపై రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య అనంతరం రక్తపు మరకలను తుడిచింది ఎవరో సీఐ శంకరయ్య స్పష్టంగా చెప్పారని, పనిమనిషి లక్ష్మి రక్తపు మరకలను తుడచగా సాక్షాలను భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గార్లు తారుమారు చేశారని సీబీఐ తమ చార్జిషీట్లో వెల్లడించడం జరిగిందని అన్నారు.
ఈ దారుణ హత్య కాండలో సాక్షాలను తారుమారు చేసిన వారి ప్రమేయం ఉందని స్పష్టంగా వెల్లడించిందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. సాక్షి రాతలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన కృష్ణారెడ్డి గతంలో ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూకు భిన్నంగా, మరొక టీవీకి ఇచ్చిన వాకింగ్ ఇంటర్వ్యూలో పేర్కొనడం పరిశీలిస్తే సాక్షులు ప్రభావితమవుతున్నారని స్పష్టమవుతుందన్నారు.