ఏపీలో ఆ 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ?

-

 

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించండని, టీడీపీ నుంచి తమ పార్టీలో చేరిన నలుగురు, తమ పార్టీ విధానాలు నచ్చక, పార్టీ నాయకత్వంతో విభేదించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి తన ప్రాణమిచ్చే శాసనసభాపతి గారి ద్వారా అనర్హత వేటు వేయించి, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధపడాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు డిమాండ్ చేశారు.

తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జెడ్పి చైర్మన్ శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని, గతంలో జరిగిన జెడ్పిటిసి ఎన్నికలను టీడీపీ బహిష్కరించిందని, ఒకటి అరస్థానాలలో మాత్రమే ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారని, శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతో ఖాళీ అయినా జడ్పీ చైర్మన్ స్థానానికి తమ పార్టీ నాయకత్వం మహిళా అభ్యర్థిని నిలబెట్టిందని, ఆమెకు ఎలివేషన్ ఇచ్చేందుకు ఇండిపెండెంట్ గా మరొక అభ్యర్థిని నిలబెట్టిందని అన్నారు.

అయినా జెడ్పి చైర్మన్ స్థానం కోసం జరిగిన ఎన్నికల్లో తమ పార్టీదే విజయమని… హవా అని సాక్షి దినపత్రికలో కథనాలు రాయడం హాస్యాస్పదంగా అనిపించిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు తమ కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఉండవల్లి ఎమ్మెల్యే శ్రీదేవి గారు కాకుండా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మా పార్టీ నాయకత్వం విధానాలు నచ్చక బయటకు వెళ్లిపోయారని అన్నారు. టీడీపీ నుంచి తమ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు తమ పార్టీ నాయకత్వంతో విభేదించి బయటకు వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news