WTC ఫైనల్ లో 444 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ గిల్ 18 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. బోలాండ్ బౌలింగ్ లో గిల్ ఆడిన బాల్… గల్లీలోకి వెళ్ళగా గ్రీన్ క్యాచ్ అందుకున్నారు. అయితే క్యాచ్ పట్టిన సమయంలో బాల్ నేలకు తగిలినట్లు కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ పరిశీలించి అవుట్ గా ప్రకటించారు.
అయితే ఇది నాటౌట్ అంటూ పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే, ఆస్ట్రేలియా ప్లేయర్ గ్రీన్ పై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘చీటర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గ్రీన్ బౌలింగ్ చేసేందుకు రాగా, గ్రౌండ్ లో ఉన్న ఫ్యాన్స్ చీట్ చీట్ అంటూ అరిచారు. ఇక నెట్టింట చీటర్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. గిల్ ఔట్ అయిన క్యాచ్ ను గ్రీన్ అందుకోగా, క్యాచ్ పట్టే టైములో బాల్ నేలను తాకింది. థర్డ్ అంపైర్ కూడా దానిని అవుట్ గా ప్రకటించారు. అయితే అది నాటౌట్ అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.