చర్చిలను రాజకీయ ప్రచార వేదికలుగా మార్చవద్దు- రఘురామ ఫైర్‌

-

 

మనశ్శాంతి కోసం చర్చిలకు వచ్చే భక్తులకు జగన్ మోహన్ రెడ్డి గారిని గెలిపించండని, ఫ్యాను గుర్తుకు ఓటేయండని చర్చిల ఫాదర్లు ప్రచారం చేయవద్దని రఘురామకృష్ణ రాజు గారు కోరారు. హిందువులు దేవాలయానికి, ముస్లింలు మసీదుకు వెళ్లినట్లుగానే క్రైస్తవులు చర్చిలకు వస్తుంటారని, మానసిక ప్రశాంతతను ఇచ్చే అటువంటి చర్చిలను రాజకీయ వేదికలుగా మార్చవద్దన్నారు.

పెనమలూరు వైకాపా కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న మంత్రి జోగి రమేష్ ఆత్మీయ సమ్మేళనం పేరిట కుల మతాల ప్రతినిధులతో, చర్చి ఫాదర్లతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించినట్టు, ఈ సమావేశాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 2000 రూపాయల నగదు, వైకాపా అభ్యర్థి ఫోటో, కుక్కర్, ప్లాస్క్ ను గ్రామ, వార్డ్ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల చేతుల మీదుగా అందజేసినట్లు వార్తా పత్రికలలో కథనాలు వెలువడ్డాయని, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అంటే ప్రభుత్వ ఉద్యోగులేనని, ఇక వాలంటీర్లు సెమీ ప్రభుత్వ ఉద్యోగులని, వీళ్ళందర్నీ అడ్డం పెట్టుకొని పాస్టర్ల ద్వారా గిఫ్టులు ఇచ్చి ఓట్లను జోగి రమేష్ కొనుగోలు చేయడం మొదలుపెట్టారని అన్నారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ… పుట్టుకతోనే క్రైస్తవులమైన మనం ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news