‘ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్’ లో రోహిత్ శర్మ లేకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్ !

-

‘ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్’ను స్టార్ స్పోర్ట్స్ పంచుకుంది. 70 మందికి పైగా మీడియా ప్రతినిధులు 15 మంది ఆటగాళ్లతో పాటు కోచ్ను ఎంచుకున్నారు. ఆటగాళ్ల జాబితాలో కింగ్ విరాట్ కోహ్లి, వార్నర్,క్రిస్ గేల్, సురేష్ రైనా, ms ధోనీ, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, పొలార్డ్,డివిలియర్స్, సూర్యకుమార్, చాహల్, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, బుమ్రా ఉన్నారు. గ్రేటెస్ట్ కోచ్గా ఫ్లెమింగ్ ( చెన్నై సూపర్ కింగ్స్)నిలిచారు.

ఇదిలా ఉంటే….‘ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్-16’లో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడంతో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 6211 రన్స్ తో నాలుగో అత్యధిక రన్స్ స్కోరర్ గా ఉన్న హిట్ మ్యాన్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ కాదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అతని కెప్టెన్సీ లోని ముంబై 2013 నుంచి 5 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన విషయాన్ని మర్చిపోయారా? అని మండిపడుతున్నారు.అయితే దీనిపై మీ కామెంట్ తెలియ చేయండి?

Read more RELATED
Recommended to you

Latest news