నెమ్మదిగా తాడేపల్లి ప్యాలెస్ ను చేరుతున్న కథ అంటూ వైసీపీ ఎంపీ రఘురా రామకృష్ణ రాజు సంచలన పోస్ట్ పెట్టారు. వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు నాలుగున్నర గంటలకు జగన్ మోహన్ రెడ్డి గారికి సమాచారం ఇచ్చింది తానేనని వై.యస్. అవినాష్ రెడ్డి గారు సీబీఐ అధికారుల విచారణలో ఎక్కడ అంగీకరిస్తారోనన్న భయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారికి పట్టుకున్నట్లు కనిపిస్తోందని వెల్లడించారు.
సీబీఐ విచారణలో ప్రభుత్వ ప్రధాన మాజీ కార్యదర్శి అజయ్ కల్లం గారు ఈ విషయాన్ని చెప్పేసి, చెప్పలేదని అంటున్నారేమోనని, నెమ్మదిగా ఈ కథ తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుంటున్నట్లు కనిపిస్తోందని అన్నారు. బందర్ పోర్టుకు గతంలో ముఖ్యమంత్రులు వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించగా, తాజాగా జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ప్రారంభించడం అదేదో సినిమాలో చెప్పినట్టుగా నా చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లి అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.