నరసాపురం నియోజకవర్గ ప్రజలపై రఘురామకృష్ణ రాజు సంచలన పోస్ట్ పెట్టారు. తాను నియోజకవర్గానికి నేనెందుకు రావడం లేదో తన నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకున్నారని, ఎంపీ నిధులను సక్రమంగా ఖర్చు చేస్తున్నానని, తన నియోజకవర్గ ప్రజలు తనతో నిత్యం టచ్ లో ఉంటున్నారని, దమ్ముంటే నియోజకవర్గానికి రమ్మని కొంత మంది దుర్మార్గులు, దుష్టులు సవాల్ చేస్తున్నారని, ప్రధానమంత్రి గారి పర్యటనకు హాజరవుతుంటే నన్ను అడ్డుకున్నారని గుర్తు చేశారు.
ప్రధానమంత్రి గారి పర్యటన సందర్భంగా లిస్టులో తన పేరు ఉంటే, ఎవరెన్ని కుట్రలు చేసి తొలగించారో తనకు తెలుసునని, నేటితో ఎంపీగా ఎన్నికై నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, 2020 ఫిబ్రవరి 17వ 18 వ తేదీలలో ఆఖరు సారి నియోజకవర్గానికి వెళ్లానని, ఈ దుర్మార్గులు దుష్టులు తనను చంపే ప్రయత్నం చేసినప్పటికీ, రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని, ఎంతో మంది దేవాలయాల్లో ప్రార్ధనలు చేశారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తనను ఈ భూమి మీద లేకుండా పైకి పంపించే ప్రయత్నం చేశారని, గత ప్రభుత్వం అడిగిన నిధులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 10,430 కోట్ల రూపాయలు కేటాయించిందని, ఈ నిధులను పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి వినియోగించాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోతే దాని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను స్వాహా చేయకుండా, పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నించాలని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు.