తక్కువ పెట్టుబడి లాభాలిచ్చే అదిరిపోయే పాలసీ.. ఎల్ఐసీ ధన్ రేఖ పాలసీ పూర్తివివరాలు..

-

భారతీయ అతి పెద్ద భీమా కంపెనీ ఎల్ఐసీ పాలసీదారులకు ఎన్నో రకాల బెనిఫిట్స్ ను అందిస్తుంది.. అందుకే ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. పెట్టుబడికి మంచి భరోసాతో పాటు బీమా కవరేజ్ కూడా అద్భుతంగా అందిస్తుందని చాలా మంది ఇందులో పాలసీలు తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు.. ఇప్పటికే ఎన్నో పాలసీలు అందుబాటులో ఉన్నాయి..

ఇక వినియోగదారులను మరింతగా ఆకట్టుకోవడానికి ఎల్ఐసీ కూడా ఎప్పటికప్పుడు కొత్త తరహా పాలసీలను ప్రవేశపెడుతూ ఉంటుంది. తాజాగా ఎల్ఐసీ ఒకేసారి పెట్టుబడి పెట్టే వారికి అనువుగా ఉండేలా సరికొత్త పాలసీలను లాంచ్ చేసింది. ఈ పాలసీ ద్వారా మంచి రాబడిని అందించడమే కాక బీమా సదుపాయాన్ని కూడా కల్పించింది. ధన్ రేఖ, మనీ-బ్యాక్ బీమా కవరేజ్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పాలసీ వినియోగదారులకు మంచి లాభాలను ఇస్తుందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ పాలసీ పాలసీదారులు మరణించే వరకు లేదా పాలసీ మెచ్యూరిటీకి వచ్చే వరకు క్రమం తప్పకుండా వారి లాభాల మొత్తాన్ని అందిస్తుంది..

పాలసీ తీసుకున్న వ్యక్తి గడువు ముందే అన్నీ చెల్లించాలి..అదే విధంగా మెచ్యూరిటీ సమయంలో జీవించి ఉన్న పాలసీదారుకు హామీనిచ్చే ఏకమొత్తం చెల్లింపులు అందిస్తారు. క్రెడిట్ సౌకర్యాల ద్వారా ఈ విధానం లిక్విడిటీ సమస్యను కూడా పరిష్కరిస్తుంది. ఈ ఎల్ఐసీ ధన్ రేఖ పాలసీని తీసుకోవడానికి కనీసం 8 సంవత్సరాల వయస్సు ఉండాలి..ఇక ఈ ప్లాన్‌లో 30 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెడితే, పాలసీ ప్రీమియం కాలపరిమితి కూడా 30 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే మీరు ఒక్కసారి ప్రీమియం రూ. 6,70,650 కడితే ప్రాథమిక హామీగా రూ. 10,00,000 బోనస్ వస్తుంది. అలాగే అనుకోని పరిస్థితుల్లో మరణం సంభవిస్తే రూ.12,50,000 మరణ బీమా కూడా ఉంటుంది. అయితే పాలసీ మెచ్యూర్ అయ్యే సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ ప్రయోజనాలు, పన్ను మినహాయింపుతో కలిపి మొత్తం రూ.23 లక్షలు వరకు పొందవచ్చు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news