ప్రసాద్ అనే వ్యక్తిని చంపి..వివేకా కేసును క్లోజ్ చేయాలని చూస్తున్నారు – వైసీపీ ఎంపీ

-

వై.యస్. వివేకానంద రెడ్డి గారితో పాటు, మరొక వ్యక్తి లచ్చమ్మ కుటుంబం చేతిలో బలికాకుండా డా. సునీత గారి భర్త రాజశేఖర్ రెడ్డి గారు కాపాడారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. వివేకానందరెడ్డి గారు రాసిన లేఖను తమకు ముందే చూపించి ఉంటే, హత్యగా భావించి రక్తపు మరకలను తుడిచే వారు కాదని నిందితుల తరఫున వకల్తా పుచ్చుకొని సాక్షి దినపత్రిక రాస్తున్న వార్తా కథనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే విధంగా వార్తా కథనాలను రాశారని, ఇప్పుడు మళ్లీ రాస్తున్నారంటే కోర్టులో ఏదో కథలు చెప్పి నిందితులు, సూత్రధారులు తప్పించుకునే ప్రయత్నం తప్పితే మరొకటి కాదని అన్నారు.
వివేకానంద రెడ్డి గారు రాసిన లేఖ గురించి సాక్షి దినపత్రిక యాజమానులు జగన్ మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు ఎందుకు కాకి గోల చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలోనే సునీత గారి భర్త రాజశేఖర్ రెడ్డి గారు సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో వివేకానంద రెడ్డి గారు రాసిన లేఖ గురించి వివరంగా చెప్పారని, హత్యకు ముందు వివేకానంద రెడ్డి గారు ఒక లేఖ రాశారని ఆయన వ్యక్తిగత సహాయకుడైన కృష్ణారెడ్డి చదివి వినిపించగానే తాను వచ్చే వరకు ఆ లేఖను ఎవరికీ ఇవ్వవద్దని చెప్పానని తన స్టేట్మెంట్లో వెల్లడించారని తెలిపారు. డ్రైవర్ ప్రసాద్ అనే వ్యక్తి సౌమ్యుడని, వివేకానంద రెడ్డి గారి శవాన్ని ఇనాయతుల్లా తీసి పంపిన ఫోటోలు చూసిన తర్వాత వివేకానంద రెడ్డి గారిది క్రూరమైన హత్య అని నిర్ధారణకు వచ్చానని రాజశేఖర్ రెడ్డి గారు తెలిపారని అన్నారు. కృష్ణారెడ్డి వద్ద వివేకానంద రెడ్డి గారు రాసిన లేఖను తీసుకున్న రాజశేఖర్ రెడ్డి గారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారికి ఒక కవర్లో పెట్టి వెంటనే అందజేశారని, ప్రసాద్ అనే వ్యక్తిని చంపివేసి ఈ కేసును క్లోజ్ చేయాలని హంతకులు, సూత్రధారులు బహుశా పథక రచన చేసి ఉంటారని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news