విజయ్ పొలిటికల్ ఎంట్రీపై నటుడు రంజిత్ కామెంట్స్

-

తమిళ్ హీరో దళపతి విజయ్ రాజకీయ ప్రవేశంపై నటుడు రంజిత్ సంచలన కామెంట్స్ చేశారు. వెయ్యి మంది విజయ్‌లు వచ్చినా తమిళనాడును మార్చలేరని అన్నారు. ప్రస్తుతం కొత్తగా పార్టీ ప్రారంభించిన నటుడు విజయ్‌ అధికార దాహంతో రాజకీయాల్లోకి వస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారు వెయ్యిమంది వచ్చినా రాష్ట్రంలో మార్పు తీసుకురాలేరని పేర్కొన్నారు.  కోవై గాంధీపురం ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఓ స్టూడియో ప్రారంభోత్సవంలో పాల్గొన్న రంజిత్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.

నటి త్రిష వ్యవహారం గురించి స్పందించిన రంజిత్.. ఇందులో ఎవరిని తప్పు పట్టలేమని అన్నారు. వైరల్‌ కంటెంట్ కోసం కూవత్తూరు సమాచారం మాట్లాడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతిసారి కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్గిస్తామని చెప్పి పెంచుకొంటూ పోతున్నాయని తెలిపారు. ఓటుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు డబ్బులు పంచేవారికి అవకాశం ఇవ్వొద్దని, రాష్ట్రంలో మార్పు కావాలన్నారు. ప్రజలు ఎన్నికలు బహిష్కరించకుండా ఓటు హక్కు వినియోగించు కోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news