ఏపీ రైతులకు శుభవార్త.. మే 10 కల్లా రైతు భరోసా డబ్బులు

-

ఏపీ రైతులకు శుభవార్త. మే నెలలో రైతు భరోసా ఇన్‌స్టాల్‌మెంట్‌ ఇచ్చేందుకు సిద్ధం కావాలన్నారు సీఎం జగన్‌. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్‌ యంత్ర సేవా పథకం కింద కిసాన్‌ డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు జగన్‌. జులై నాటికి 500 డ్రోన్లు ఇచ్చేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ రూపొందించింది. డిసెంబర్‌ నాటికి 1500కు పైగా డ్రోన్లు ఇచ్చే దిశగా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంఉన్నారు.

cm jagan
cm jagan

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ, ధాన్యానికి మరింత ధర వచ్చేలా రైతులకు తగిన అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. విదేశాల్లో డిమాండ్‌ ఉన్న వంగడాలను సాగు చేయడంపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. రైతులకు అవసరమైన వంగడాలు, వాటి విత్తనాలను అందుబాటులో ఉంచాలని వెల్లడించారు.

సీఎం యాప్ ద్వారా వివిధ ప్రాంతాల్లో వివిధ పంటలకు వస్తున్న ధరలు, వాటి పరిస్థితుల పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి…నిరంతరం మాక్‌ డ్రిల్‌ చేస్తూ పని తీరును పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం వైయస్‌.జగన్‌. వైయస్సార్‌ రైతుభరోసా కింద రైతులకు డబ్బు జమ చేసేందుకు సిద్ధం కావాలని..అర్హులైన రైతుల జాబితాలను వెల్లడించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మే 10 కల్లా అర్హులైన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news