రూ.246 కోట్ల‌తో సూప‌ర్‌స్పెషాలిటీ ఆస్ప‌త్రులు – విడదల రజినీ

-

గిరిజ‌నుల‌కు మెరుగైన వైద్య‌సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న‌న్న గొప్ప గొప్ప అడుగులు వేస్తున్నార‌ని తెలిపారు ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గిరిజ‌న ప్రాంతాల్లో సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని చెప్పారు. అందుకోసం రూ.246 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్పారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో 104, 108 స‌ర్వీసుల‌ను అమాంతం జ‌గ‌న‌న్న పెంచార‌ని పేర్కొన్నారు. ఏజెన్సీ లోని ప్ర‌తి గ్రామానికి ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య సేవ‌లు అందేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. ప్ర‌తి విలేజ్ హెల్త్ క్లినిక్‌కు ప్ర‌భుత్వ వైద్యులు వ‌చ్చి వైద్య సేవ‌లు అందిచే రోజుల‌ను జ‌గ‌న‌న్న తీసుకురాగ‌లిగార‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబునాయుడు గిరిజనుల‌కు మెరుగైన వైద్యం అందించాలే క‌నీస ఆలోచ‌న కూడా చేయ‌లేదని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల‌ను ఏజెన్సీ ప్రాంతాల్లో నెల‌కొల్పేదిశ‌గా టీడీపీ ప్ర‌భుత్వం క‌నీసం ఆలోచించ‌లేద‌న్నారు. గిరిజ‌నుల మేలు కోసం చంద్ర‌బాబునాయుడు చేసింది శూన్యం అని మండిప‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news