ఆసిఫాబాద్‌లో రేపు పోడు పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్

-

తెలంగాణ పోడు రైతులకు శుభవార్త. పోడు రైతుల సమస్యలు ఎట్టకేలకు పరిష్కారం కాబోతున్నాయి. పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర సర్కార్ ప్రారంభించబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 30వ తేదీ (శుక్రవారం)న ఆసిఫాబాద్‌లో పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఈ విషయాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. పోడు పట్టాల పంపిణీపై మహబూబాబాద్ కలెక్టరేట్‌లో బుధవారం రోజున మంత్రి సత్యవతి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోడు హక్కుల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 3 లక్షల 8 వేల ఎకరాలకు పట్టాల పంపిణీ జరిగిందని మంత్రి తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలోని 4 లక్షల 6 వేల ఎకరాల పోడు భూములకు సీఎం కేసీఆర్‌ పట్టాలు అందిస్తారని వెల్లడించారు. అధిక సంఖ్యలో గిరిజనులను భూ యజమానులుగా చేయనున్న  ఈ కార్యక్రమం చరిత్రలోనే గొప్ప విషయమని మంత్రి సత్యవతి చెప్పారు. పోడు పట్టాల పంపిణీతో పోడు రైతుల సమస్య పరిష్కారమైనట్టేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news