డిసెంబర్ 11న రైతులతో కలిసి వైసీపీ ర్యాలీలు నిర్వహించి, కలెక్టర్లకు వినతి పత్రం అందజేయనున్నట్టు మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రదానంగా మూడు సమస్యలపై పోరాడుతున్నామని రైతుల సమస్య, కరెంట్ బాదుడు, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. ప్రజా సమస్యలపై డిసెంబర్ లో ఉద్యమం చేపడుతున్నామన్నారు.
రైతులకు పెట్టుబడి సాయం, మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం కరెంట్ చార్జీలతో బాదుడే బాదుడు చేస్తుందన్నారు. డిసెంబర్ 11న రైతుల సమస్యలపై, డిసెంబర్ 27న కరెంట్ ఛార్జీలపై ఆందోళన, ఎస్ఈ కార్యాలయాలు, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. అలాగే జనవరి 3న ఫీజు రియంబర్స్ మెంట్ అంశం పై పోరుబాట చేపట్టనున్నట్టు వెల్లడించారు. విద్యార్థులతో కలిసి జనవరి 03న కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రం అందిస్తామని తెలిపారు మాజీ సీఎం జగన్.