వైయస్ జగన్ ను సత్కరించిన రామ గోవిందరెడ్డి..!

-

ఉమ్మడి కడపజిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో బ్రహ్మంగారిమఠం మండల జడ్పీటీసి ముత్యాల రామ గోవింద్ రెడ్డి నిలిచారు. కడప జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో చైర్మన్ పదవికి రాజీనామా చేసారు. అయితే చైర్మన్ సీటు ఖాళీ అవడంతో ఎన్నికలకు ముందే రామ గోవిందరెడ్డికి చైర్మన్ పదవి హామీ ఇచ్చారు మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి. ఇచ్చిన హామీ మేరకు నేడు చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.

నేడు జరిగిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చైర్మన్ అభ్యర్థిగా రామ గోవింద్ రెడ్డి పేరు ఖరారు చేసారు. కడప జిల్లాలోని జడ్పీటీసిలందరూ రామ గోవిందరెడ్డి కి మద్దతు తెలపాలని వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసారు. దాంతో మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిలతో కలిసి జగన్మోహన్ రెడ్డిని సత్కరించారు జడ్పీటీసి గోవింద రెడ్డి. వైయస్ జగన్మోహన్ రెడ్డికి శాలువా పూలమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు జడ్పీటీసి రామ గోవిందరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news