రాజధానిలో వేగంగా జంగిల్ క్లియరెన్స్ పనులు

-

ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతిలో వేగంగా జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. మొత్తం 24 వేల ఎకరాలకు గానూ 7-8 వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పూర్తైందంటున్నారు సీఆర్డీఏ. వచ్చే నెల మొదటి వారంలోగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నారు. పొక్లెయినర్లు, జేసీబీలతో పిచ్చి చెట్లను, తుమ్మ చెట్లను తొలగిస్తున్నారు.  తొలగించిన పిచ్చి చెట్లను తరలించాలా..? లేక తగులబెట్టాలా..? అనే అంశంపై సీఆర్డీఏ సమాలోచనల చేస్తోంది.

ఐఐటీ నిపుణులకు ఇచ్చేందుకు నీళ్లల్లో మునిగిన ఐకానిక్ కట్టడాల శాంపిల్స్ తీస్తుంది సీఆర్డీఏ. ఇక కట్టడాల్లోని ఐరన్, సిమెంట్, కాంక్రీటుకు చెందిన మరిన్ని శాంపిళ్లను తీస్తుంది సీఆర్డీఏ. మరోవైపు బోట్లల్లో వెళ్లి శాంపిల్స్ తీస్తున్నారు సీఆర్డీఏ సిబ్బంది. సీఆర్డీఏ పంపిన శాంపిళ్లను పరిశీలించాక నివేదిక పంపనున్నట్టు ఐఐటీ నిపుణులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news